రక్తదానంపై అపోహాలు వీడండి: రెడ్ క్రాస్ చైర్మన్

SKLM: యువత రక్తదానంపై అపోహాలు వీడి రక్తదానం చెయ్యాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్ మోహన రావు సోమవారం పిలుపునిచ్చారు. నగరంలో ఒక మహిళకు శస్త్రచికిత్స సమయంలో అతి తక్కువగా దొరికే ఎబి నెగెటివ్ రక్తం ఆవసరం కాగా.. విషయం తెలుసుకున్న నగరానికి చెందిన కొల్ల లక్ష్మణ రావు ముందుకు వచ్చి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.