VIDEO: 'ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించండి'
WNP: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి IDOC కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో 34 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.