4317 మందికి మందుల పంపిణీ

ప్రకాశం: తాళ్లూరు PHC పరిధిలో జాతీయ నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. 26 అంగన్వాడీ స్కూళ్లు, 25 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, 2 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 4317 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రవీణ్, యాదవ్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.