రోడ్లపై అధిక వేగంతో వాహనాలు నడపకూడదు: ఎస్సై

రోడ్లపై అధిక వేగంతో వాహనాలు నడపకూడదు: ఎస్సై

Srcl: బోయిన్‌పల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ట్రాక్టర్ వాహనాల డ్రైవర్లు, యజమానులతో ఎస్సై రమకాంత్ సమావేశమయ్యారు. ట్రాక్టర్లకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సుతోనే వాహనాలు నడపాలని, రోడ్లపై అధిక వేగంతో వాహనాలు నడపకూడదని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.