వీధి దీపాలు వెలగక ప్రజలకు ఇబ్బందులు
తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని రజకుల కాలనీ, బేరిపేట ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో చీకటి కారణంగా ప్రయాణికులు, స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.