నివారణ చర్యలను రైతులకు వివరించిన అధికారి

గురువారం పెద్దపల్లి నియోజకవర్గం జాలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్ వరి, మొక్కజొన్న పంటలను సందర్శించారు. వరి పొలంలో ఎక్కువగా మొగి, రెక్కల పురుగు ఉధృతంగా ఉన్నందున నివారణ చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐతె చంద్రశేఖర్, ధూలికట్ట తిరుపతి, మొగురం శంకరయ్య, సుంకే మధు, రైతులు పాల్గొన్నారు.