YS జగన్‌పై మంత్రి స్వామి హాట్ కామెంట్స్
ప్రకాశం: 30 ఏళ్లు అధికారం నాదేనంటూ విర్రవీగిన జగన్‌ని ప్రజలు ఐదేళ్లకే భరించలేక తిరస్కరించినా.. మళ్ళీ మరో 30 ఏళ్లు అధికారం తమదేనని జగన్ కార్యకర్తలను మభ్యపెడుతున్నాడని మంత్రి స్వామి అన్నారు. సోమవారం అసెంబ్లీలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్‌కి పదవులు మీద ఉన్న ఆరాటం ప్రజాసమస్యలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు.