విదుర నీతి: చనిపోయాక తోడొచ్చేది ఇదే!
మనిషి చనిపోయాక సంపద ఇంట్లోనే ఉండిపోతుంది. బంధుమిత్రులు శ్మశానం వరకే వస్తారు. శరీరాన్ని అగ్ని దహించేస్తుంది. కానీ.. బ్రతికున్నప్పుడు ఆచరించిన ధర్మం, చేసిన పుణ్యకార్యాలు మాత్రమే జీవుడి వెంట వస్తాయని విదురుడు బోధించారు. జీవితంలో ఎంత సంపాదించినా చివరకు తోడు వచ్చేది మనం చేసిన మంచి మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలి.