కొత్త వెలగాడలో ఫారం పాండ్స్ ప్రారంభం

VZM: గంట్యాడ మండలంలోని కొత్త వెలగాడ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఉపాధి నిధులతో నిర్మించిన ఫారం పాండ్స్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. పనులను చక్కగా చేసిన మహిళ ఉపాధి వేతన దారులతో మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఉపాధి వేతనదారులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అలాగే దీంతో భూగర్భ జలాలు స్థాయి పెరుగుతోందని అన్నారు.