'సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంపుల కొరత లేదు'

'సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంపుల కొరత లేదు'

ATP: గుత్తిలో స్టాంపుల కొరత లేదని సబ్ రిజిస్ట్రార్ మంజునాథ్ బుధవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కొందరు స్టాంపుల కొరత ఉందని ప్రచారం చేస్తున్నారని, కస్టమర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి స్టాంపులు తీసుకెళ్లవచ్చునన్నారు. రూ.10, 20, 30, 50 విలువజేసే స్టాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు.