గుండెపోటుతో ఎస్సై మృతి
కృష్ణా: గుండెపోటుతో ఎస్సై మృతి చెందిన ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. చిలకలపూడి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంగాధరరావు మంత్రి కొలుసు పార్థసారథి కాన్వాయ్ గుడివాడ మీదుగా నూజివీడుకు వెళ్తుండగా మార్గ మధ్యలో గుండెపోటుకు గురయ్యారు. అప్రమత్తమైన మంత్రి వెంటనే ఎస్సైను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.