VIDEO: సంగారెడ్డిలో 4 ఉత్తమ పాఠశాలలు ఎంపిక
SRD: సంగారెడ్డి మండలంలో జిల్లా పరిశీలన బృందం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలల అభివృద్ధికి, మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్న పోతిరెడ్డిపల్లి, సదాశివనగర్, గొల్లగూడెం, ఫసల్వాది ప్రాథమిక పాఠశాలలను మండల స్థాయిలో ఉత్తమ పాఠశాలలుగా ఎంపిక చేశారు. ఎంపికైన పాఠశాలల హెచ్ఎంలను ఎంఈవో విద్యాసాగర్, జిల్లా పరిశీలన బృందం సభ్యులు ఘనంగా సన్మానించారు.