VIDEO: అద్భుతం.. ఎగిసిపడుతున్న గంగమ్మ
శ్రీ సత్యసాయి జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొర్రెవు గ్రామానికి చెందిన రైతు మాలింగప్ప తన పొలంలో బోరు వేయగా.. 470 అడుగులకే గంగమ్మ ఉబికివచ్చింది. భూగర్భజలాలు ఏకంగా 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎండిపోయిన నేలల్లో నీరు ఇలా పైకి చిమ్మడం చూసి స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.