VIDEO: గుంతకల్లులో ఓ మోస్తారు వర్షం

ATP: గుంతకల్లు పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. గత ఐదు రోజులుగా మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో జలమయమయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.