శతాబ్ధి కాంతుల్లో ఆంధ్రా యూనివర్సిటీ
VSP: ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. విద్యుత్ కాంతుల్లో వర్సిటీ ప్రాంగణం వెలుగుతోంది. వందేళ్ల ప్రస్థానం కలిగిన యూనివర్సిటీ ఎందరో మహానుభావులను తీర్చిదిద్దింది. నోబెల్ విజేత సర్ సీవీ రామన్ వంటి దిగ్గజాలు ఇక్కడ ప్రొఫెసర్‌గా పనిచేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌కు డాక్టరేట్ కూడా ప్రధానం చేసింది.