కల్లూరులో 11 గంటలకే 45.05 శాతం నమోదు
KMM: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కల్లూరులో వేగంగా సాగుతోంది. బుధవారం ఉదయం 11 గంటల సమయానికే పట్టణంలో 45.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 18,886 మంది ఓటర్లకు గాను, సుమారు 8,500 మంది తమ హక్కును వినియోగించుకున్నారు. 20 వార్డుల పరిధిలోని 40 కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.