గూగుల్ మ్యాప్స్‌తో జాగ్రత్త..!
తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్స్ చాలా ఉపయోగపడుతుంది. కానీ, కొన్ని సార్లు రోడ్డులేని ప్రాంతాలకు, చెరువులోకి తీసుకెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా బోడుప్పల్-పోచారం రూట్‌లో ఓ వ్యక్తి మ్యాప్స్ అనుసరిస్తూ.. పెద్ద గుంతలో పడిపోయాడు. అందుకే మ్యాప్స్ చూపిస్తున్న దిశను గుడ్డిగా నమ్మకుండా పరిసరాలను గమనించండి. రాత్రిపూట మరింత జాగ్రత్తగా ఉండాలి.