41 ఏళ్లు సేవ చేసిన ఎస్సైలకు ఎస్పీ సన్మానం
MBNR: జిల్లాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో 41 ఏళ్ల విశిష్ట సేవ అనంతరం పదవీ విరమణ పొందిన ఇద్దరు సబ్-ఇన్స్పెక్టర్లు (ఎస్సైలు) ఎండి. ఆజమ్ అలీ, ఎం.ఏ. రషీద్లను జిల్లా ఎస్పీ డి.జానకి శుక్రవారం సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో 4 దశాబ్దాల పాటు క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠతో పనిచేయడం గొప్ప విషయమన్నారు. ఎంతో నిబద్దతో వారు సేవలు అందించారని కొనియాడారు.