సిద్దిపేట బస్టాండ్ పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద పలు సమస్యలు ఉన్నాయని డిపో మేనేజర్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ శనివారం పరిశీలించారు. బస్టాండ్ వద్ద ఉన్న పబ్లిక్ టాయిలెట్ చుట్టూ చెత్త ఉండటం గమనించారు. వెంటనే నిర్వాహకులను పిలిచి చెత్తను శుభ్రం చేయించారు. బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పాన్ డబ్బాను వెంటనే తొలగించాలన్నారు