చేపల పంపిణీలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే

JGL: జిల్లా కేంద్రంలోని కండ్లపల్లి చెరువులో రూ. లక్ష 35 వేల చేప పిల్లలను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ శుక్రవారం విడుదల చేశారు. మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు ఎంతో లాభాలు తెచ్చిపెడుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు.