బాధిత కుటుంబాలకు ఎస్సై నిత్యవసర వస్తువులు అందజేత
SKLM: మందస మండలంలోని బుడార్సింగి పంచాయతీ పద్మాపురం కాలనీలో జరిగిన అగ్నిప్రమాదంలో బాధిత కుటుంబాల ఇళ్లలోని గృహోపకరణాలు, నిత్యవసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న మందస ఎస్సై కె. కృష్ణప్రసాద్ వెంటనే గ్రామానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను ఆయన స్వయంగా అందజేశారు.