కోటిపల్లి రైల్వే పనులు మరింత ఆలస్యం
కోనసీమ: కోటిపల్లి-నరసాపురం రైల్వే ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంపై జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు మంగళవారం రైల్వే డిప్యూటీ CE శ్రీధర్తో ఫోన్లో మాట్లాడారు. పనుల్లో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైనతేయ, వశిష్ట నదులపై బ్రిడ్జిల సూపర్ స్ట్రక్చర్ పనులు మహారాష్ట్ర, గుజరాత్లలో జరుగుతున్నాయని CE వివరణ ఇచ్చారు. వర్షాకాలం వస్తే పనులు మరింత ఆలస్యమవుతాయన్నారు.