'తెనాలి అర్బన్ బ్యాంక్‌ను నిర్వీర్యం చేశారు'
GNTR: తెనాలిలో 120 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అర్బన్ బ్యాంక్‌ను కొంతమంది పాలకులు నిర్వీర్యం చేశారని మాజీ టీడీపీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ బ్యాంకు కొందరు వ్యక్తుల చేతుల్లోనే ఉంటూ అభివృద్ధి సాధించలేకపోయిందని ఆరోపించారు. బ్యాంకు అభివృద్ధి లక్ష్యంగా తాను పాలక మండలికి పోటీ చేస్తున్నానని తెలిపారు.