VIDEO: విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే
కృష్ణా: పమిడిముక్కల మండలం ఆగినిపర్రు గ్రామంలోని జెడ్పీహెచ్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.