భూ నిర్వాసితులను ఆదుకోవాలి: కొండా హరీష్ గౌడ్

భూ నిర్వాసితులను ఆదుకోవాలి: కొండా హరీష్ గౌడ్

SRPT: వ్యవసాయ కళాశాల నిర్మాణ భూ నిర్వాసిత రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీవో శ్రీనివాసులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి ఎకరాకు రూ. 30 లక్షల పరిహారం, ఒక కుటుంబ సభ్యునికి ఉద్యోగం, ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.