పొంగిపొర్లుతున్న వాగులు.. నిలిచిపోయిన రాకపోకలు

పొంగిపొర్లుతున్న వాగులు.. నిలిచిపోయిన రాకపోకలు

BHPL: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. మహాముత్తారం మండలంలో పెద్ద వాగు, కోణంపేట వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో అడవి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం-మేడారం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకపోతే బయటికి రావద్దని అధికారులు ఇవాళ సూచించారు.