రోడ్డుపైనే సంత.. భారీగా ట్రాఫిక్..!
NRPT: కోస్గి శివాజీ కూడలిలో ఆదివారం సంత సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా కనిపించాయి. కళాశాల మైదానం సమీపంలో ఉల్లి విక్రయదారులు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపి వ్యాపారం నిర్వహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన స్థానికులు, వాహనదారులు పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.