అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
KMM: తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని సంతరూట్‌లో ఎస్సై కూచిపూడి జగదీశ్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. సుబ్లేడు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఓ ఆటోలో 100 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ జి. మహేశ్, పి. కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పి. ఉపేందర్ ద్వారా గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈమేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.