డుంబ్రిగుడలో చలివేంద్రం ఏర్పాటు

డుంబ్రిగుడలో చలివేంద్రం ఏర్పాటు

ASR: డుంబ్రిగుడలో ప్రేమ బంధు ఫౌండేషన్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. మండల విద్యాశాఖ అధికారి జి.గెన్ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అప్పలరాజు పాల్గొన్నారు.