భారత్–దక్షిణాఫ్రికా మధ్య సముద్ర భద్రత సహకారం
VSP: దక్షిణాఫ్రికా నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ మోండే లోబేసే సోమవారం విశాఖలోని భారత నౌకాదళ శిక్షణ కేంద్రాలైన ఐఎన్‌ఎస్ శాతవాహన, ఐఎన్‌ఎస్ విశ్వకర్మలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు, సిమ్యులేటర్ విన్యాసాలను పరిశీలించి భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఈ పర్యటనతో భారత్–దక్షిణాఫ్రికా మధ్య సముద్ర భద్రత సహకారం మరింత బలపడింది.