కాణిపాకంలో అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు

కాణిపాకంలో అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు

CTR: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయం వద్ద ఏసీ, నాన్‌ ఏసీ కల్యాణ మండపాలు, అధితిగ్రహం నిర్మాణాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.25 కోట్ల తితిదే నిధులు మంజూరు చేస్తూ మంగళవారం జీవో జారీ అయ్యింది. గత నెల 28న జరిగిన తితిదే పాలక మండలి సమావేశంలో కాణిపాకంలో అభివృద్ధి పనులకు తీర్మానిస్తూ నిర్ణయం తీసుకున్నారు.