వినుకొండలో నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

PLD: వినుకొండలో ఆధార్ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంగళవారం నుంచి ఈనెల 23 వరకు ఎన్‌ఎస్‌పీ కాలనీలోని సచివాలయం 1, ఓబయ్య కాలనీలోని సచివాలయంలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.