పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన విద్యార్థి
ADB: బోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన అర్ధాంగి నీలమ్మ అనే మహిళ అనారోగ్యంతో సోమవారం మరణించారు. నీలమ్మ మొదటి కుమారుడు అర్ధాంగి సాయి తల్లి మరణించిన దుఃఖాన్ని సైతం దిగమింగుతూ 10వ తరగతి చివరి పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా అనంతరం నిర్వహించిన అంత్యక్రియలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.