పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

BHNG: భువనగిరి మండలం నందనం గ్రామంలో ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, ఈ సంవత్సరం ఎన్ని అడ్మిషన్స్ వచ్చాయని స్కూల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. సంఖ్య తక్కువగా ఉందని, మళ్లీ గ్రామంలో 'బడిబాట' నిర్వహించి కొత్త విద్యార్థులు చేరేలా ప్రోత్సహించాలని సూచించారు.