విజయవాడలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
AP: త్వరలో విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ సాయంత్రం మంత్రి నారాయణ 3 ప్రధాన రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పోరంకి నుంచి మురళీ రిసార్ట్స్ రోడ్డు వరకు, ఆటోనరగ్ బస్టాండ్ పక్క రోడ్డును మురళీనగర్ వరకు 80 అడుగుల రోడ్డుగా విస్తరణ, బల్లెంవారి వీధి నుంచి నిడమానూరు ప్రధాన రహదారి వరకు మరో విస్తరణ జరగనుంది. రూ.105 కోట్లతో CRDA ఈ పనులు చేపట్టింది.