ముగిసిన నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2026
VSP: తొలి విడత నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ శుక్రవారంతో ముగిసింది. ఏప్రిల్ 14 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో నౌకాదళ ఆపరేషనల్ సిద్ధత, మౌలిక వసతులు, మానవ వనరులపై సమీక్ష నిర్వహించారు. నౌకాదళ ప్రధాన అధికారి మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియా ఘర్షణలు, ప్రభుత్వేతర శక్తుల ముప్పుల నేపథ్యంలో సముద్ర భద్రత సవాళ్లను ప్రస్తావించారు.