నేడు మంత్రి వివేక్ పర్యటన

MNCL: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రామకృష్ణాపూర్‌లోని కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనన్నారు.