విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

KMM: చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ చెట్టుపోగు రంగయ్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. బుధవారం నాగులవంచ చెరువు వాగు పక్కన వ్యవసాయ పొలానికి మోటార్ బిగిస్తుండగా అకస్మాతుగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.