సమ్మె ఎఫెక్ట్.. తాజా పరిస్థితులు
HYD: RTC సమ్మె ప్రభావంతో MGBS, JBSతో పాటు పలు బస్ స్టేషన్లు జనాల్లేక వెలవెలబోతున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే వారు రవాణా సౌకర్యం లేక బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్ వాహనాల దోపిడీతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.