జిల్లాకు భారీ వర్ష సూచన
కోనసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వరి, అరటి, కొబ్బరి తోటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.