చెరువులో యువకుడి మృతదేహం కలకలం

HYD: శామీర్‌పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికి తీశారు. మృతుడు రసూల్ (25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నాడు.