ఉప్పల్ వ్యాప్తంగా హై డివైడర్ల నిర్మాణం

మేడ్చల్: ఉప్పల్ పరిధిలోని నాచారం, మల్లాపూర్, డాక్టర్ ఏఎస్ రావు నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వాహనదారుల సౌకర్యార్థం రహదారులపై హై డివైడర్లు ( రైజ్డ్ కెర్బ్) నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు పనులు 80 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. దీని ద్వారా ప్రమాదాలను సైతం తగ్గించే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు పేర్కొన్నారు.