VIDEO: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అందజేత: ఎస్పీ
SRPT: బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఆయన కార్యాలయంలో వారికి అందజేశారు. ఈరోజు ఎస్పీ మాట్లాడుతూ.. ఫోన్ పోగొట్టుకున్న వారు ఆందోళన చెందవద్దని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కనుక్కొని తిరిగి అప్ప చెప్పడం జరుగుతుందని ఆయన సూచించారు. మొత్తం 100 ఫోన్స్ రికవరీ చేసి బాధితులకి అందజేసినట్లు తెలిపారు.