'వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి'

NRML: కుబీర్ మండలంలోని కుష్టి గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ సిబ్బంది ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ అందజేశారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఆరోగ్యం పై జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ANM శోభ, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.