మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్త ఆశలు
కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 50 నుంచి 60కి పెరుగనుందన్న వార్తలు రాజకీయల్లో ఆసక్తిని రేపుతున్నాయి. త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో, డివిజన్ల సంఖ్య పెరిగితే తమకు పోటీ చేసే అవకాశం దక్కుతుందని టికెట్ ఆశించే వారు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆశలు చిగురింపజేసినప్పటికీ, మారుతున్న రిజర్వేషన్లు ఎవరికి అనుకూలంగా ఉంటాయోనన్న ఆందోళన కనిపిస్తోంది.