ఏయూలో సైక్లింగ్ రేసుతో ప్రారంభమైన ఉత్సవాలు
విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం భారీ సైకిల్ రేసు నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఋషికొండ వరకు సాగిన ఈ పోటీని వీసీ జీవీ రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 10,000, ద్వితీయ బహుమతిగా రూ.5,000 ప్రకటించారు.