అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
కోనసీమ: కూటమి పాలనలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శనివారం ఒక్కరోజే 13గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా జొన్నాడలో రూ.40లక్షల ఎమ్జీఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన సిసి రోడ్డులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.