గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

JGL: గంజాయి అక్రమ సరఫరా కేసులో ఇర్పాన్ అనే వ్యక్తిని జగిత్యాల టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివేకానంద మినీ స్టేడియం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని పట్టుకున్నారు. గత ఏడాది నుంచి పోలీసులకు తప్పించుకుంటూ వస్తున్న ఇతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.