మహిళల అభ్యున్నతే ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే
WNP: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన శుక్రవారం పెద్దమందడి జగత్ పల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం మహిళలలకు చీరలను పంపిణీ చేశారు.