ఆత్మకూరులో 'కోటి సంతకాల సేకరణ'
NLR: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమని YSR ట్రేడ్ యూనియన్ కార్యవర్గ సభ్యులు మండిపడ్డారు. ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారు. ఇప్పటికైనా మనసు మార్చుకుని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.